
బెజ్జంకి, వెలుగు: మండలంలోని దేవక్కపల్లి మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టీ (స్టాటిస్టికల్సర్వైలెన్స్ టీం) శిబిరాన్ని కలెక్టర్ హైమావతి ఆదివారం తనిఖీ చేశారు. రిజిస్టర్ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రతీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించి వీడియో చిత్రీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని కేంద్రాన్ని సందర్శించారు.
రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. స్టాఫ్ నర్స్ పద్మ తప్ప సిబ్బంది సెలవులపై వెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.