
- సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం
- కఠిన చర్యలు తీసుకోవాలని డీఎండ్ హెచ్ఓకు ఫోన్
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: లీవ్ పెట్టకుండా ఆరుగురు నర్సులు, ఓ హెడ్ నర్స్ ఆబ్సెంట్ కావడంతో కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డ గ్రామం వద్ద ఎస్సీఎస్టీ శిబిరం, మీర్జాపూర్, అక్కన్నపేట పీహెచ్సీలను కలెక్టర్ హైమావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీర్జాపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ లీవ్‌లో ఉండగా హాస్పిటల్ మొత్తంలో ఒక్కరే నర్సు విధుల్లో ఉండడాన్ని గుర్తించారు.
గైర్హాజరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫోన్ ద్వారా ఆదేశించారు. తహసీల్దార్ తరచు పీహెచ్‌సీని మానిటర్ చేయాలని సూచించారు. అక్కన్నపేట మండలంలోని కుందన్వానిపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థను పరిశీలించి, వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలను పరిశీలించారు. రైతుల నుంచి జనుము విత్తనాలు, సీతాఫలాలు కొనుగోలు చేసి వారికి చెల్లింపులు చేసిన విధానాన్ని అభినందించారు. అక్కన్నపేట పీహెచ్సీలో సీజనల్ వ్యాధుల పరీక్షలు చేయాలని, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మారెడ్డి ఉన్నారు.