
సిద్దిపేట రూరల్, వెలుగు: జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని కలెక్టర్హైమావతి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో దీపావళి సందర్భంగా పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేరనే బాధను వారికి రాకుండా చూసుకోవాలని, సీసీ కెమెరాలు రిపేర్ చేయించాలనీ, పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని సూపరింటెండెంట్ ప్రతిభను ఆదేశించారు.
రామాయణ, మహాభారత కథలు చదవాలని గాయత్రి శ్లోకాలు జపిస్తే నెగిటివ్ ఎనర్జీ మన వద్దకు రాదని సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి ప్రార్థన చేసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం శిశుగృహను సందర్శించి శిశువులను సొంత పిల్లల కంటే ఎక్కువగా చూడాలని వారికి మీరే అమ్మ నాన్న అనేలా చూసుకోవానని సూచించారు. పండగ రోజు తన క్యాంపు ఆఫీసులో స్వయంగా వంట చేసి భోజనం పెడతానని, పిల్లలందరినీ క్యాంపు ఆఫీసుకు తీసుకురావాలని డీడబ్ల్యూవో శారదని ఆదేశించారు.