హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించనున్న ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్)లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం ఐక్యత పాదయాత్ర వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 వరకు mybharat.gov.in వెబ్సైట్ ద్వారా జాతీయస్థాయిలో వ్యాసరచన, లఘు చిత్రాలు, క్విజ్ పోటీలు జరుగుతున్నాయని, 15–-29 ఏండ్ల మధ్య వారు ఇందులో పాల్గొనవచ్చని వివరించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్లో నవంబర్ 19న యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
