ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్  హైమావతి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 174 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణి అర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీని అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్​వో నాగరాజమ్మ పాల్గొన్నారు.

డెంగ్యూపై అవగాహన కల్పించాలి

జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ప్లేట్ లెట్స్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లడ్ కోసం విద్యా సంస్థల్లో  మెడికల్​క్యాంపు నిర్వహించాలని సూచించారు. ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ వైద్యం మాత్రమే చేయాలన్నారు. జిల్లాలోని అన్ని వాటర్ ట్యాంక్ లు శుభ్రం చేయాలని  మిషన్​ భగీరథ అదికారులకు సూచించారు.