
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో ఎన్నికల నియమావళిని అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో సీపీ విజయ్ కుమార్ తో కలిసి ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఇబ్బందులపై నివేదిక ఇవ్వాన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆర్ఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్వో ధనరాజుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్ఎంపీల పనితీరుపై మెడికల్ ఆఫీసర్లు ప్రతీ నెల తనిఖీలు చేపట్టాలన్నారు. డ్రై డే పాటించడంతోపాటు శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని చెప్పారు.