క్రీడలతో మానసిక ఉల్లాసం : ఇలా త్రిపాఠి

 క్రీడలతో మానసిక ఉల్లాసం  : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్ వెలుగు : పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసానికి  దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్గొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-–2025ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా​మాట్లాడుతూ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమన్నారు. పోలీస్ శాఖకు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, ఇవి నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజమని, అందరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. జీవితంలో ప్రతిఒక్కరికీ ఎన్నో ఆటుపోట్లు వస్తాయని, వాటిని తట్టుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ పోటీల్లో నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లతోపాటు నల్గొండ ఏఆర్ విభాగం జట్లు పాల్గొన్నాయి. అనంతరం కలెక్టరేట్​లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు.  ఏఎస్పీ మౌనిక, ఎస్బీ డీఎస్పీ రమేశ్, డీటీసీ డీఎస్పీ విఠల్ రెడ్డి, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం.. 

 కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కట్టంగూరు మండలం అయిటిపాములలో ఏర్పాటు చేసిన కట్టంగూరు స్వచ్ఛ శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. సోలార్ విద్యుత్ యూనిట్లలోని బ్యాటరీల పరిస్థితి, ఉత్పత్తిలను పరిశీలించారు. కలెక్టర్ వెంట కట్టంగూరు రైతు ఉత్పత్తుల సమాఖ్య అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి, స్వచ్ఛ శక్తి కేంద్రం ప్రతినిధి సుధాకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ ఉన్నారు.