పోలింగ్ పై అవగాహన కల్పించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

పోలింగ్ పై  అవగాహన కల్పించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

ఆర్మూర్/నిజామాబాద్ సిటీ, వెలుగు: ఈ  నెల 30న జరిగే పోలింగ్ ప్రక్రియపై ఎలక్షన్​ డ్యూటీ అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహ న కల్పించాలని మాస్టర్ ట్రైనర్లకు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు. ఆర్మూర్ మండలం చేపూర్ లోని క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజ్​ లో  ఆర్మూర్ నియోజకవర్గ ప్రిసైడింగ్ ఆఫీసర్స్​, అసిస్టెంట్​ ప్రిసైడింగ్ ఆఫీసర్స్​ కు  జరుగుతున్న రెండో విడత శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. 

ఫెసిలిటేషన్ సెంటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను ట్రైనర్లు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. గోప్యతను పాటించేలా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన నిర్ణీత ఫారంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. హాజరు పట్టికను తనిఖీ చేశారు. 

ట్రైనింగ్ తరగతులకు గైర్హాజరైన పీఓ, ఏపీవోల  నుంచి కారణాలు  తెలుసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని పోలింగ్ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. 

ALSO READ :  ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధత కల్పిస్తం: నిర్మలా సీతారామన్

ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట  ఆర్మూర్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్​ వినోద్ కుమార్,   అధికారులు, తదితరులు ఉన్నారు.