15 రోజుల్లో ‘సీతారామ’భూ సేకరణ పూర్తి చేయాలి : కలెక్టర్ జితేశ్

15 రోజుల్లో ‘సీతారామ’భూ సేకరణ పూర్తి చేయాలి : కలెక్టర్ జితేశ్
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ కు సంబంధించి 15 రోజుల్లోగా భూ సేకరణ పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​  ఆదేశించారు. కలెక్టరేట్​ నుంచి పలు శాఖల జిల్లా ఆపీసర్లు, తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, బూర్గంపహాడ్​, చుంచుపల్లి, చంద్రుగొండ, దమ్మపేట, జూలూరుపాడు, కొత్తూగూడెం, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్​ మండలాల్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​కు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. 

రోజూ ఏ మండలంలో ఎంత వరకు సర్వే పూర్తి అయిందో వివరాలతో నివేదికలను అందజేయాలన్నారు. సీతమ్మ సాగర్​ ప్రాజెక్టుకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లోనని 30 గ్రామాల్లో భూ సేకరణ పనులను భద్రాచలం సబ్​ కలెక్టర్​ పర్యవేక్షించాలని చెప్పారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్​ఎంట్రీలు, బ్లర్​ ఫొటోలు, ఇతర లోపాలను గుర్తించి, నిబంధనల ప్రకారంగా సరిదిద్దాలన్నారు. 

ప్రతి పోలింగ్​ స్టేషన్​ పరిధిలో సూపర్​ వైజర్లు, బూత్​ స్థాయి అధికారులు కో ఆర్డినేషన్​తో పనిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఎక్కువ, తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్​ కేంద్రాలను ఎంపిక చేసుకొని బుధవారం మ్యాపింగ్​ చేయాలన్నారు. రైస్​ మిల్లులతో పాటు కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలన్నారు.