
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాంబేలో గురువారం జరిగిన ప్రోగ్రాంలో నేషనల్జియో స్పేషియల్ ప్రాక్టీషనర్అవార్డుతో పాటు జీఐఎస్ కో హార్ట్ అవార్డును ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్.కిరణ్ కుమార్ కలెక్టర్జితేశ్ కుమార్కు అందజేశారు. ఎఫ్ఓఎస్ఎస్ఈఈ, ఐఐటీ బాంబే, భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోగ్రాంలో ఈ అవార్డులను కలెక్టర్ అందుకున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం చూపిన చొరవ, జియో స్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో కలిసి ఓపెన్ సోర్స్ జీఐఎస్ సదస్సు నిర్వహణతో పాటు ఈ టెక్నాలజీలో స్టూడెంట్స్ ను, అధికారులను భాగస్వాములుగా చేశారు.
దేశంలో మొట్టమొదటి ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహార్ట్ను భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడంలో కలెక్టర్ చొరవ చూపారు. గోదావరి వరదల టైంలో ముంపు గ్రామాల గుర్తింపుతో పాటు రైతులను మునగ సాగు వైపు మారుస్తూ స్వయం సమృద్ధి వైపు నడిపించడం లాంటి పలు కార్యక్రమాలకు గానూ ఈ అవార్డును అందజేశారు. జీఐఎస్ ఆథారిత వ్యవస్థలను మరింతగా జిల్లాలో విస్తరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.