
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని పలు రైసుమిల్లుల్లో బుధవారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ తనిఖీలు చేపట్టారు. బిచ్కుంద మండలంలోని ఓ రైసుమిల్ను కలెక్టర్ సందర్శించారు. గత సీజన్లో సీఎంఆర్కోసం ఇచ్చిన వడ్ల స్టాక్, బియ్యం స్టాక్‌ను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ భిక్కనూరు మండలం కాచాపూర్‌లోని రైసుమిల్లులో తనిఖీలు చేశారు. సీఎఆర్టార్గెట్రీచ్ కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్వో మల్లికార్జున్ఉన్నారు.