టేకులపల్లి మండలంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్

టేకులపల్లి మండలంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్

ఇల్లెందు(టేకులపల్లి), వెలుగు: టేకులపల్లి మండలంలోని సులనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ముత్యాలంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  పాఠశాలలో విద్యా ప్రమాణాలు,  మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ వారి పాఠ్య పుస్తకాలు, నోట్‌‌బుక్​లను పరిశీలించారు. వారికి తెలుగు భాషలో రాయడం, చదవడం పరీక్షించారు.  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఔషధాల లభ్యత, సిబ్బంది హాజరు, రోగుల రిజిస్టర్లు, డాక్టర్ల హాజరు పత్రాలు, ల్యాబ్, ఔషధ నిల్వల రికార్డులను పరిశీలించారు.  

భూ సమస్యలు పరిష్కరించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వచ్చే నెల 15వ తేదీ లోపు భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్​ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు.  కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు.  భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిమెంట్​, స్టీల్​ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.