ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలి : కలెక్టర్ కె. హైమావతి

ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలి : కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రిలోనే  వైద్యం చేయించుకోవాలని, మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కలెక్టర్  కె. హైమావతి అన్నారు.  గురువారం చిన్నకోడూరు మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని డాక్టర్,  సిబ్బంది ప్రతి ఒక్కరు డిప్యూటేషన్, ఇతర విధుల్లో ఉన్న లెటర్ రిజిస్టర్ లో పెట్టాలని తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో  పరిశీలించి, పేమెంట్ కు ఎలాంటి ప్రాబ్లం ఉండదని, త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.  సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వండుతున్న వంటలను పరిశీలించారు. తక్కువ క్వాంటిటీలో వండడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్ లను గుర్తించాలని ఆఫీసర్లను ఆదేశించారు.