
- కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీ నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులను సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. భీమిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఎంపీడీఓ గంగామోహన్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు.
ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో పొందుతున్న వైద్య సేవల వివరాలు రోగులను అడిగి తెలుసుకున్నారు. మల్లిడి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కన్నెపల్లి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, భీమిని ఎంపీడీఓ గంగామోహన్, తహసీల్దార్ బికర్ణదాస్ తదితరులున్నారు.