
చెన్నూరు, వెలుగు: గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని పుష్కర ఘాట్లను పరిశీలించినట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం చెన్నూరు మండల కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ ను తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
గత పుష్కరాల్లో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని, స్కూళ్ల అభివృద్ధి పనులు, అమృత్ 2.0 పథకం పనులు, ఇతర అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాయ్స్హైస్కూల్ను సందర్శించి కిచెన్, క్లాస్‌రూమ్‌లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషకాహారం, శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
క్రీడలతో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి
నస్పూర్, వెలుగు: హాజీపూర్ మండలం గుడిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ జి. దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్కుమార్దీపక్హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టిచర్ లాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాస్వామిక భావనలు, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయన్నారు. స్కూల్ఎన్నికల ద్వారా ఎంపికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, ఇతర విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు.