ఓటర్ జాబితా మ్యాపింగ్లో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షనే : కలెక్టర్ మను చౌదరి

ఓటర్ జాబితా మ్యాపింగ్లో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షనే : కలెక్టర్ మను చౌదరి
  • కలెక్టర్ మను చౌదరి హెచ్చరిక

మల్కాజిగిరి, వెలుగు: ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చివరి స్థానంలో ఉందని కలెక్టర్ మను చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గురువారం మల్కాజిగిరి జోనల్ ఆఫీస్​లో ఓటర్ జాబితా అనుసంధాన ప్రక్రియ పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల ఆఖరిలోగా ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధించాలని సూపర్​వైజర్లను, బీఎల్​వోలను ఆదేశించారు. ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.