
వికారాబాద్, వెలుగు: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు మార్చి18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9:-30 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 310 పరీక్షా కేంద్రాల్లో 13,412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 29 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీవో విజయ్ కుమారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం.శంకర్ నాయక్, డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్‌ఓ పాల్వన్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.