
హైదరాబాద్, వెలుగు : పంచాయతీ సెక్రటరీల సంఘం ప్రెసిడెంట్ శ్రీకాంత్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పీఆర్ మంత్రి సీతక్క.. మహబుబాబాద్ కలెక్టర్ శశాంకను ఆదేశించారు. దాంతో శ్రీకాంత్ మళ్లీ విధుల్లో చేరాలని కలెక్టర్ గురువారం ఆదేశాలిచ్చారు. శ్రీకాంత్.. మహబుబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకుండపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ (జూనియర్ పంచాయతీ సెక్రటరీ)గా పనిచేస్తూ సెక్రటరీ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
తమ సమస్యలను పరిష్కారించాలని గత బీఆర్ఎస్ గవర్నమెంట్‌ను డిమాండ్ చేస్తూ సెక్రటరీలు సమ్మె చేశారు. దాంతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా ఆయనను పక్కన పెట్టింది. డ్యూటీకి అటెండ్ అవ్వకూడదని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క శ్రీకాంత్‌కు మళ్లీ పోస్టింగ్ ఇప్పించారు.