విద్యార్థుల బంగారు భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాటలు వేయండి : పమేలా సత్పతి

విద్యార్థుల బంగారు భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాటలు వేయండి : పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యారంగంలో టీచర్ల సేవలు వెలకట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ పమేలా సత్పతి టీచర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు టీచర్ల దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూళ్ల విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరారు.

 అనంతరం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 43 మంది,  ప్రైవేట్ స్కూళ్లకు  చెందిన 17 మంది టీచర్లకు  ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. గత విద్యా సంవత్సరం టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 100  శాతం రిజల్ట్స్ సాధించిన 95 ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలకు  బహుమతులు అందజేశారు. అనంతరం ప్రభుత్వ స్కూళ్లల్లో  ఇటీవల ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్ లాంతర్న్’ లోగోను ఆవిష్కరించారు. 

కలెక్టర్‌‌‌‌‌‌ను ప్రశంసించిన ఉగాండా ప్రతినిధులు

బాలికల భద్రత, విద్య, అభివృద్ధి, జీవన నైపుణ్యం కోసం జిల్లాలో చేపడుతున్న వాయిస్ ఫర్ గర్ల్స్, స్నేహిత వంటి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఉగాండాకు చెందిన ‘గర్ల్ ఆఫ్ ఉగాండా’ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించింది. హనుమాన్ నగర్ లోని మైనారిటీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, బొమ్మకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించారు. అనంతరం కలెక్టర్ పమేలాసత్పతిని కలిసి ప్రశంసించారు. ఉగాండా ప్రతినిధులు మాట్లాడుతూ ఇక్కడి స్కూళ్లల్లో విద్యార్థులు జీవన నైపుణ్యాలు, విద్య, స్వీయ రక్షణపై గురించి అవగాహన కలిగి ఉన్నారని, ఈ విధానాలను తమ దేశంలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, డీఈవో చైతన్యజైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు జిల్లా సైన్స్ ఆఫీసర్  జైపాల్ రెడ్డి, గర్ల్ ఆఫ్ ఉగాండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోనికా నైరాగుహాబ్వా, సహ వ్యవస్థాపకురాలు బాబ్, ప్రోగ్రామ్ అసోసియేట్ జోన్ పాల్గొన్నారు.