10,568 ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల విచారణ పూర్తి : పమేలాసత్పతి

10,568 ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల విచారణ పూర్తి : పమేలాసత్పతి
  • కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇప్పటివరకు 10,568 ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లకు విచారణ పూర్తిచేసినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అత్యంత పేదలకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఆదివారం జరిగే నీట్ పరీక్షకు జిల్లాలోని 7 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు పూర్తిచేశామన్నారు. సమావేశంలో సీపీ  గౌస్ ఆలం, అడిషనల్  కలెక్టర్లు ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేశాయ్, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్,  డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ స్టూడెంట్లకు ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ 

కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన  విద్యను అభ్యసిస్తేనే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. శుక్రవారం సిటీలోని సీతారాంపూర్ ఐవీవై స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐవీవై, సిద్దార్థ  స్కూళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంపును ఆయా స్కూళ్ల చైర్మన్లు పసుల మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​,  దాసరి శ్రీపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.