ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడొద్దు : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడొద్దు : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి విద్యార్థులందరికీ దంత వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మంకమ్మతోట ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు డాక్టర్లు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు.

 డెంటిస్టులు చేస్తున్న పరీక్షలను పర్యవేక్షించి కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 10 నుంచి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో డెంటల్‌‌‌‌‌‌‌‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నామని, ఇందులో దంత సమస్యలతో బాధపడుతున్న 1500 మందిని గుర్తించినట్లు తెలిపారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ జి.వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, డాక్టర్లు రవి ప్రవీణ్, రణధీర్, ప్రవీణ్, రాజిరెడ్డి, మంగ, శరత్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.