
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, సబ్కలెక్టర్ఉమాహారతితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 61 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
పింఛన్లు, సంకేమ పథకాలు, భూ వివాదాలు, ఆరోగ్యం, విద్యకు సంబందించిన వినతులు ఎక్కువగా వచ్చాయన్నారు. ఈ సందర్భంగా పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాయికోడ్ మండలం పిప్పలపల్లి గ్రామానికి చెందిన హరి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం నివ్వాలి
సిద్దిపేట టౌన్: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజల నుంచి 168 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వినతులను అందజేస్తారని వాటిని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ హైమావతి కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మెదక్: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. మెదక్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 56 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వేగంగా సమస్యలు పరిష్కరించి ప్రజావాణి పై నమ్మకాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ట్రిపుల్ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
సంగారెడ్డి (హత్నూర): ట్రిపుల్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. బాధిత రైతులు మాట్లాడుతూ ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు, చత్తీస్ గఢ్ విద్యుత్ లైన్ లో భూములు కోల్పోయామని మళ్లీ ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
భూమికి భూమి లేదా మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం అందించాలన్నారు. భూమిని కోల్పోతున్న కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ ను కోరారు. నోటీసుల్లో పేర్కొన్న అమౌంట్ సరిపోదని సరైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కాసాల గ్రామ రైతులు పాల్గొన్నారు.