
- అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో క్రీడల కోసం గ్రౌండ్ఏర్పాటు చేయాలని కలెక్టర్ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కాలేజీ ప్రాంగణంలో పర్యటించారు. ఆర్అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు కాలేజీ ప్రాంగణంలో గ్రౌండ్ కోసం అవసరమైన స్థలం సర్దుబాటుపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రౌండ్అవసరమన్నారు.
క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం భేగ్ కు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింలు, రవికుమార్, జీజీహెచ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.