విద్యార్థుల భ‌ద్రత‌పై దృష్టిపెట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య

విద్యార్థుల భ‌ద్రత‌పై దృష్టిపెట్టాలి :  కలెక్టర్ ప్రావీణ్య
  •  కలెక్టర్​ ప్రావీణ్య

రాయికోడ్/మునిప‌ల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంప‌ల్లి గురుకుల సొసైటీ విద్యార్థుల భ‌ద్రతపై దృష్టి పెట్టాలని క‌లెక్టర్ ప్రావీణ్య అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం గురుకుల స్కూల్,​ కాలేజీలో కూలిన భవన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యలను అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి ప‌రిశీలించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, టీఎస్ఎఫ్ డి బృందాలు చేపట్టిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపి శిథిలాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం క‌లెక్టర్ మాట్లాడుతూ..గురుకుల స్కూల్​కు నూతన హాస్టల్ భవనం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్  అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రిన్ పాల్ కు సూచించారు. క‌లెక్టర్ వెంట ఎస్పీ కార్పొరేషన్ ఈడీ, మండ‌ల స్పెషలాఫీస‌ర్  రామాచారి, తహసీల్దార్ గంగాభ‌వాని, ఎంపీడీఓ హ‌రినంద‌న్ రావు ఉన్నారు.

నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్​మెంట్ పై శిక్షణ 

జహీరాబాద్: నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్​మెంట్​పై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కలెక్టర్ ప్రావీణ్య  అధికారులను ఆదేశించారు. కోహీర్ మండలం కవేలి చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్​మెంట్​భవనాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ శాఖల ద్వారా శిక్షణ ఇప్పించాలని సూచించారు. త్వరలోనే ఓరియంటేషన్ ప్రోగ్రాంలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.