
కొండాపూర్, వెలుగు: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని రేణిగుంట, మాసాను కుంట చెరువులను పరిశీలించారు. రేణిగుంట చెరువు గండిని పూడ్చాలన్నారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నంబర్08455 - 276155కు ఫోన్‌చేయాలని సూచించారు.
ప్రతీ చెరువును ఇంజనీర్లు తనిఖీ చేయాలని చెప్పారు. ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి, బాధితులుంటే చికిత్స అందించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు రోజువారీగా గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై నివేదికల ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్ జయరామ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు .
కాంప్లెక్స్ స్కూళ్లను తనిఖీ చేయాలి
కాంప్లెక్స్ స్కూళ్లను తనిఖీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో చేపడుతున్న కార్యక్రమాలను స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఫేస్రికగ్నైజేషన్ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలని సూచించారు. అడిషనల్కలెక్టర్(లోకల్‌బాడీస్) చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు బాలయ్య, వెంకటేశం, తాజుద్దీన్, సుప్రియ పాల్గొన్నారు.