పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం : కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య

పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం : కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: పోలీస్‌‌ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని పరేడ్​గ్రౌండ్‌‌లో పోలీస్‌‌ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపానికి ఎస్పీ ఎస్పీ పరితోష్‌‌ పంకజ్‌‌తో కలిసి నివాళులర్పించారు. పోలీస్‌‌ అమరుల కుటుంబసభ్యులను శాలువాతో సన్మానించారు. అనంతరం కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సంగారెడ్డి పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 

విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేశారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ధైర్యసాహసాలు ముఖ్యమన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, వారి కుటుంబసభ్యులతో వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణపరంగా జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలిచినట్లు  తెలిపారు.   

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, ప్రజల రక్షణ, ధన, మాన ప్రాణాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని సిద్దిపేట సీపీ ఎస్‌‌ఎం విజయ్ కుమార్ అన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, జిల్లా పోలీసు అధికారులు, అమరుల పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌‌ అమరులకు నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.  

మెదక్​ టౌన్​, వెలుగు : 

శాంతిభద్రతలలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని... ఈ విషయంలో ప్రజలు వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. మంగళవారం --పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్​ ఎస్పీ పెరేడ్​ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్​ రాహుల్​ రాజ్​, అడిషనల్​ ఎస్పీ మహేందర్​లు కలిసి పోలీసుల అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులతో జ్ఞాపకాలను గుర్తు 
చేసుకున్నారు.