
- సిద్దిపేట, మెదక్లో వినతులు స్వీకరించిన కలెక్టర్లు
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ప్రావీణ్య సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై మొత్తం 27 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. వాటిని పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్వో పద్మజ రాణి పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజావాణికి 152 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మల్లన్న సాగర్ లో ముంపునకు గురైన తొగుట మండలం రాంపూర్ మత్స సహకార సంఘంలోని తొమ్మిది చెరువులకు లీజు కట్టమని మత్సశాఖ ఏడీ నుంచి ప్రతీ సంవత్సరం నోటీసులు వస్తున్నాయని, వాటిని తమ పరిధిలో నుంచి తొలగించాలని కోరుతూ మత్స సహకారసంఘం నాయకులు కలెక్టర్ కు అర్జీని అందజేశారు.
జగదేవ్ పూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని పిచ్చకుంట్ల కులానికి చెందిన తమకు 2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పట్టాలు అందజేశారని, అందులో సాగు చేసేందుకు వెళ్తే ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సిద్దిపేట పట్టణంలోని 28వ వార్డులో సెట్ బ్యాక్, సెల్లార్ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 28వ వార్డు ప్రజలు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
మెదక్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఐడీఓసీ ఆఫీసులో ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 96 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.