
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. ఆస్పత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
ఇందిరా మహిళా శక్తి భవనం పనులను వేగవంతం చేయాలి
మెదక్ టౌన్: పట్టణంలో నిర్మాణంలో ఉన్న మహిళా శక్తి భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఈ భవనం రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించుకుంటున్నామని పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు.