మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

 మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ఆదేశించారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ..ఎమ్మార్సీ బిల్డింగ్స్-, పీఎం శ్రీలో క్లాస్ రూమ్స్ , సైన్స్ ల్యాబ్స్-,  డైట్ బిల్డింగ్, వెల్దుర్తి మండలంలో ఇంటర్మీడియట్ బ్లాక్ పనులపై చర్చించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్,  విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని  సూచించారు. 

సమావేశంలో డీఈవో రాధాకిషన్, పంచాయతీరాజ్​ ఈఈ నర్సింలు, విద్యా సంక్షేమ మౌలిక వసతుల సంస్థ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ నర్సింహాచారి, జేఈలు పాల్గొన్నారు. అనంతరం అనంతరం మెదక్ డైట్ కాలేజీలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్​ఎంలతో మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. స్టూడెంట్స్​కు నాణ్యమైన విద్య అందించాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ లో బెస్ట్ అవైలేబుల్ స్కీమ్​లో మిగిలిపోయిన సీట్లకు స్టూడెంట్స్​తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. 1, 5 తరగతుల్లో ముగ్గురు స్టూడెంట్స్​చొప్పున ఆరుగురిని ఎంపిక చేశారు.