నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : రాహుల్​ రాజ్​

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : రాహుల్​ రాజ్​

మెదక్, వెలుగు: లోక్​సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు మెదక్​ కలెక్టరేట్​లో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మెదక్​లోక్​సభ రిటర్నింగ్​ఆఫీసర్, కలెక్టర్​ రాహుల్​రాజ్ ​తెలిపారు. మంగళవారం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల18న ఎలక్షన్​నోటిఫికేన్​జారీ అవుతుందని, అదే రోజు నుంచి నామినేషన్​లు స్వీకరిస్తామని తెలిపారు. రికగ్నైజ్డ్​ పొలిటికల్​పార్టీలు, అన్​రికగ్నైజ్డ్​ పొలిటికల్ పార్టీల తరుపున, ఇండిపెండెంట్​అభ్యర్థులు నామినేషన్​దాఖలు చేయొచ్చన్నారు. 

మెదక్ ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్ లోని తన చాంబర్​లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్​ సందర్భంగా అభ్యర్థితో కలుపుకుని ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ రోజుకు ఆరోజు దాఖలైన నామినేషన్ల వివరాలు, అభ్యర్థుల అఫిడవిట్లను​ఎంసీఎంసీ లో నోటీస్​బోర్డుమీద డిస్​ప్లే చేస్తామని పేర్కొన్నారు. 
 
రూ.28.89 లక్షలు సీజ్​     ​  

ఇప్పటి వరకు తనిఖీల్లో 19 మంది నుంచి రూ.28,89,830 సీజ్​ చేశామని కలెక్టర్​తెలిపారు. ఇందులో 13 మంది గ్రీవెన్స్ సెల్​కు అప్లై చేసుకోగా సరైన పత్రాలు చూపించిన 11 మందికి సంబంధించి రూ.15,21,730 రిలీజ్​ చేశామని చెప్పారు. సరైన ప్రూఫ్స్​సబ్మిట్​చేయని 8 మందికి సంబంధించిన రూ.13,68,100 పెండింగ్​లో ఉన్నాయన్నారు.  ఎంసీసీ ఉల్లంఘనకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు. ఎక్సైజ్​డిపార్ట్​మెంట్​102 కేసులు నమోదు చేయగా తనిఖీల్లో రూ.93,57,003 విలువైన 98,490 లీటర్ల మద్యం సీజ్​ చేశామని చెప్పారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​ వెంకటేశ్వర్లు ఉన్నారు.