రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చేగుంట మండలంలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించారు.  కలెక్టర్ మాట్లాడుతూ అన్ని  వసతి గృహాల్లో అవసరమైన  మరమ్మత్తులు చేపట్టి సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. 

ఇంజనీరింగ్  అధికారులు తయారుచేసిన నివేదికల మేరకు చేగుంట మండలంలో  ఎస్సీ, బీసీ వసతి గృహాలను పరిశీలించామని చెప్పారు. త్వరలోనే అన్ని సంక్షేమ వసతి గృహాల, ఆశ్రమ పాఠశాలల వార్డెన్స్, ప్రిన్సిపాల్స్, గురుకులాల ఆర్ సీవోలతో సమావేశం నిర్వహించి సంపూర్ణ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. 

పంట కోత ప్రయోగాలపై అవగాహన 

కలెక్టరేట్ లో పంటకోత ప్రయోగాలపై సహాయ గణాంక అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు  అవగాహన కల్పించారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పంట కోత ప్రయోగాలు ఎలా నిర్వహించాలో  శిక్షణ ఇచ్చారు. సీపీవో ఇందిర, డీఏవో దేవకుమార్, ఏడీఏ వినయ్, టెక్నికల్ ఏవో వందన పాల్గొన్నారు.