పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పోక్సో చట్టంపై  అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

​మెదక్​ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు, డ్రగ్స్​ నిర్మూలన, పోక్సో చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సూచించారు. గురువారం కలెక్టరేట్​ లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాలల హక్కులను రక్షించాలన్నారు. 

డ్రగ్స్ నిరోధకం, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి యువతీ యువకులు సన్మార్గం వైపు నడిచేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్​ రావు, ఆర్డీవో రమాదేవి, డీడబ్ల్యూవో హేమభార్గవి, మహమ్మద్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.