ప్రజావాణిపై ప్రతీ వారం సమీక్ష : కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజావాణిపై ప్రతీ వారం సమీక్ష : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ఇక నుంచి ప్రతీవారం సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్​కలెక్టరేట్ లో  ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలన్నారు. మొత్తం 87 ఫిర్యాదులు రాగా అందులో భూ సమస్యలు25, పెన్షన్స్ 4, డబుల్ బెడ్ రూమ్19, ఇతర సమస్యల పట్ల 39 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్​రావు, డీఏవో గోవింద్, అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ మను చౌదరి సూచించారు.  సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణిలో  భాగంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. మొత్తం 46  దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.

అనంతరం  20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం  అందడం లేదని ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ పథకాలను తమకు వర్తింపజేయాలని కోరుతూ ఆశ వర్కర్లు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ వో నాగ రాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్ : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో భాగంగా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.

మొత్తం 60 వినతులు రాగా అందులో రెవెన్యూ 30, సర్వే ల్యాండ్ రికార్డు 5, పౌరసరఫరాల శాఖ 2,  పంచాయతీరాజ్ 7, పురపాలక శాఖ 5, జిల్లా సంక్షేమం 4, విద్యాశాఖ1, వ్యవసాయం 3, వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖల నుంచి దరఖాస్తులు అందాయని కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ వో పద్మజారాణి, జిల్లా అధికారులు, సిబ్బంది 
ఉన్నారు.