ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి :  కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదిలాబాద్, వెలుగు : ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో సీనియర్ సిటిజన్లకు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ, వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తూ, 80 ఏండ్లు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందన్నారు. ఈ సందర్భంగా పలువురు వయోవృద్ధులను శాలువాతో సన్మానించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, స్వీప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా పాల్గొన్నారు.

కుంటాల : కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం కుంటాల మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అందకూర్ లో పోలింగ్ బూత్ లను పరిశీలించారు. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించి, బోగస్ ఓట్లను ఏరివేయాలని బీఎల్ వోలకు సూచించారు. గ్రామంలో బెడ్ సిస్టం ద్వారా సాగవుతున్న సోయా పంటను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం,హైస్కూల్ ను తనిఖీ చేశారు. బీసీ బాలుర వసతి గృహం, స్థానిక ఆదర్శ పాఠశాలను పరిశీలించి అసౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

లోకేశ్వరం : సవరణల తర్వాత రూపొందించిన ఓటర్ లిస్టులను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం లోకేశ్వరం మండలం హవర్గ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్ లిస్టులో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయా? లేదా చూసుకోవాలని, తప్పులుంటే వాటిని వాటిని సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కలెక్టర్​వెంట భైంసా ఆర్డీఓ కోమల్​రెడ్డి, తహసీల్దార్ మోతిరాం, ఎంసీ బాలకృష్ణ తదితరులున్నారు.