వినాయక నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

వినాయక నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి :  కలెక్టర్ రాహుల్ రాజ్
  • మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ శ్రీనివాస్​ రావు

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు, ప్రాంతీయ శాంతి కమిటీ సభ్యులు పలు సందేహాలు,  అభ్యర్థనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 

జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు మాట్లాడుతూ... వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ముందుగా ప్రతి ఒక్కరు ఆన్​లైన్​ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని... మండపాల వద్ద నాణ్యమైన ఎలక్ట్రికల్ వైర్లను వాడాలని సూచించారు. అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్, డీజేల వినియోగించరాదన్నారు.  సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ నగేష్​, ఏఎస్పీ  మహేందర్, ఆర్డీవో రమాదేవి, ​డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రాజశేఖర్​ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఎస్​బీ ఇన్స్​పెక్టర్​ సందీప్​ రెడ్డి, రంగా కృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.