
రామాయంపేట, వెలుగు: ప్రజలకు డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం మండలంలోని డి.ధర్మారం పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి బ్లడ్ , ఎక్స్ రే ల్యాబ్ ను పరిశీలించారు. రోగులకు దగ్గరకు వెళ్లి వారి అనారోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రసవాల గూర్చి తెలుసుకుని థైరాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నమోదు, సీజనల్ వ్యాధులు, సాధారణ ప్రసవాలు ఎన్ని జరిగాయని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని సూచించారు.