మెదక్‌టౌన్, వెలుగు: సర్పంచులు నిష్పక్షపాతంగా పనులు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని డిగ్రీ కాలేజీలో నూతన సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లోని సర్పంచులు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని, పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట, నార్సింగి మండలాల్లోని 100 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ జరుగుతుందన్నారు.
పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ రవీందర్, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్లు సురేశ్, సాయిబాబా, ఎంపీడీవోలు చిన్నారెడ్డి, షాజీవోద్దీన్, తిరుపతి రెడ్డి, మోజామ్, మహిపాల్ రెడ్డి, ముజీబ్, సర్పంచులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
పాపన్నపేట: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ సూచించారు. పాపన్నపేట మండలం కొడపాకలోని జడ్పీ హై స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం టీచర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సిలబస్ ఎంత వరకు అయింది, ఎలా చదువుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు
