చిన్న కాళేశ్వరం భూసేకరణలో వేగం పెంచాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

 చిన్న కాళేశ్వరం భూసేకరణలో వేగం పెంచాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ ​భూపాలపల్లి, వెలుగు : జిల్లాలోని చిన్న కాళేశ్వరం మొదటి, రెండు దశల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్​శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో భూ సేకరణ ప్రక్రియపై ఎస్డీసీ, ఎల్ఏ, ఆర్ఆర్, ఇరిగేషన్, మెగా కంపెనీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని తెలిపారు. 

ప్రాజెక్టు పూర్తి చేయడంలో భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులు, మ్యుటేషన్, పరిహారం చెల్లింపులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఎస్డీసీ, భూసేకరణ, ఆర్ఆర్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పనుల్లో ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

లబ్ధిదారులకు తగిన పరిహారం అందేలా, పునరావాస కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఎస్డీసీ రమేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఇరిగేషన్, మెగా కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.