ఆర్​వో ఆర్​ చట్టంతో అందరికీ లాభమే : రాహుల్​రాజ్

 ఆర్​వో ఆర్​ చట్టంతో అందరికీ లాభమే : రాహుల్​రాజ్
  •  కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్​టౌన్​, వెలుగు: అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం ఆర్​వోఆర్​ చట్టాన్ని తీసుకువస్తోందని కలెక్టర్​ రాహుల్​రాజ్​ అన్నారు. శుక్రవారం మెదక్​కలెక్టరేట్​లో ఆర్​వోఆర్​ ముసాయిదా చట్టం -2024 అమలు తీరుపై  చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందరితో సమాలోచన చేసి చట్టం తెచ్చేందుకు అన్ని జిల్లాల్లో ఈ చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ చర్చా వేదికల్లో లాయర్లు, రైతు సంఘాల నాయకులు, రిటైర్​ఉద్యోగులు, అధికారులు, మేధావులు పాల్గొని సూచనలు అందించాలని కోరారు. ఇందుకోసం  ప్రభుత్వం వెబ్ సైట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. 

అన్ని వివరాలు పొందుపర్చాలి

సిద్దిపేట: ఆర్ వోఆర్​యాక్ట్​లో రైతు కుటుంబ వివరాలు అన్నీ ఉండాలని వీటిని ఆధారంగా చేసుకునే భూముల రిజిస్ట్రేషన్​జరగాలని పలువురు మేధావులు సూచించారు. 
శుక్రవారం కలెక్టర్​మనుచౌదరి అధ్యక్షతన ఆర్ వో ఆర్​-24 ముసాయిదా బిల్లుపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..ఆర్ వో ఆర్ 2024 ముసాయిదా బిల్లు గురించి జరిగిన చర్చలో అన్ని వర్గాల సూచనలు తీసుకున్నామని ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

అంతకు ముందు అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక తహసీల్దార్​వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ ఆర్​వో ఆర్​చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ట్రెసా సభ్యులు, జర్నలిస్టులు, రైతులు పాల్గొన్నారు.