ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలే : రాజర్షి షా, క్రాంతి

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలే : రాజర్షి షా, క్రాంతి

మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​ కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్,  డీఆర్​వో  పద్మశ్రీ తో కలిసి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో దూరప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని వారి ఇబ్బందులను గమనించి ఆయా శాఖల అధికారులు సమస్యను పరిష్కరించాలని సూచించారు. అనంతరం మొత్తం 91 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా ధరణి సమస్యలు, పింఛన్లు, దలితబంధు బాధితులు, తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలె

సిద్దిపేటలో..

సిద్దిపేట టౌన్: ప్రజావాణిలో భాగంగా  సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​కలెక్టర్​శ్రీనివాస్ రెడ్డి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ సంబంధిత, ఆసరా పింఛన్లు,  ఇతర సమస్యలు మొత్తం కలిపి 24 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా తొలగించిన తమను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిద్దిపేట ఏరియా హాస్పిటల్​ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులు అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.  

కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని వినియోగంలో ఉన్న మినీ వాటర్ ట్యాంకును అక్రమంగా కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన మేల్కు రాజు గౌడ్  ఫిర్యాదు చేశాడు. కార్యక్రమం లో డీఆర్​వో నాగరాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో..


సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో ఆమె  అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 47 అప్లికేషన్లు రాగా అందులో రెవెన్యూకి సంబంధించి17, ఇతర సమస్యలు 30 ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి,  ఏవో పరమేశ్,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.