జనగామ అర్బన్, వెలుగు: నీట్ పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ములుగు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మే నెలలో నిర్వహించనున్న నీట్పరీక్షల నిర్వహణపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో రెండు సెంటర్లు కేటాయించగా, సుమారు 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
