
జనగామ అర్బన్, వెలుగు : ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమంపై అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమంపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది.. ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన లక్ష్యాలను వివరించారు.
అనంతరం కలెక్టర్మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీఎండీడీకేవై కార్యక్రమానికి జనగామ జిల్లా ఎంపికైనందున అధికారులందరూ కలిసి పనిచేసి త్వరలో యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏవో, డీఆర్డీవో, మత్స్యశాఖ అధికారి, డీసీవో
తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జలాల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
భూగర్భ జలాల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని, జిల్లాలో భూగర్భ జలాలను పెంచేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్అధ్యక్షతన భూగర్భ జల అంచనా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా భూగర్భ జలాధికారి సీహెచ్. నర్సింహులు జిల్లాలో గల భూగర్భ వనరుల వివరాలను వివిధ శాఖల అధికారులకు వివరించారు. భూగర్భ జలవనరులను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కలిగి ఉండాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు సూచించారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా పౌరులకు సాధికారత కలిగిందని, అధికారులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునే హక్కు వారికి ఉందన్నారు. ఈ చట్టం అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని ఇవ్వగలతారని తెలిపారు.