ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణకు సంబంధించి అవార్డు పాస్‌‌ చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంప్ ఆఫీసు నుంచి రెవెన్యూ, ఇంజనీరింగ్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు.  నేషనల్ హైవేకు సంబంధించి పెండింగ్‌‌లో ఉన్న భూసేకరణ అవార్డు స్పీడప్ చేయాలన్నారు.   కోయిల్ సాగర్ కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, మెయిన్ కెనాల్స్‌‌ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌  అవార్డులను వెంటనే పాస్ చేసి.. నిర్వాసితులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.   ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై మాట్లాడుతూ  అభ్యంతరాల క్షుణ్ణంగా పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు.   ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌‌‌‌ జిల్లాలో పర్యటించనున్నారని,  అన్ని శాఖలకు సంబంధించిన నివేదికలు వెంటనే తనకు సమర్పించాలని ఆదేశించారు. అడిషల్ కలెక్టర్ కె.సీతారామ రావు,స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీకి అభినందన  

సభ్యత్వ నమోదు, కరోనా టైంలో సేవలందించడంతో పాటు అనాథ స్కూల్ నిర్వహణకు గాను జిల్లాకు అత్యధికంగా 18 గోల్డ్ మెడల్స్‌‌, 4 సేవా పతకాలు వచ్చాయి.  దీంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీని మంగళవారం కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అభినందించారు.  ఈ నెల 15న  రాజ్ భవన్‌‌లో రాష్ట్ర గవర్నర్  తమిళిసై చేతుల మీదుగా అవార్డులను స్వీకరించనున్నట్లు లయన్ నటరాజ్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, రెడ్ క్రాస్ సొసైటీ లోని డాక్టర్ శామ్యూల్, జగపతిరావు, లయన్ నటరాజ్, రమణయ్య పాల్గొన్నారు.

అలంపూర్‌‌‌‌లో ఫాక్షన్ ప్రభావం తగ్గింది: ఐజీ కమలాసన్ రెడ్డి

గద్వాల, వెలుగు: అలంపూర్‌‌‌‌ ప్రాంతంలో  గతంలో ఫ్యాక్షన్ ప్రభావం ఉండేదని,  తెలంగాణ ఏర్పడ్డాక పోలీసులు తీసుకుంటున్న చర్యలతో  ఫ్యాక్షనిజం తగ్గిందని ఐజీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అలంపూర్ సర్కిల్ ఆఫీసును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఏఏ పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.?  పెండింగ్ కేసులెన్ని..?  యాక్సిడెంట్లు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి..?  ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల పరిస్థితి ఏంటి.. ? తదితర అంశాలపై  సర్కిల్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ సూర్య నాయక్‌‌ను అడిగి తెలుసుకున్నారు.  100 డయల్‌‌కు వేగంగా స్పందించాలని,   పోలీస్ స్టేషన్ లలో 5 ఎస్ అమలు తీరు పక్కాగా ఉండాలని సూచించారు.  24 గంటలు గస్తీ నిర్వహించాలని,  నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.  టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలని సూచించారు.    కలెక్టరేట్‌‌తో పాటు జిల్లా ఎస్పీ, ఇతర  పోలీస్ ఆఫీసులను త్వరలోనే సీఎం కేసీఆర్‌‌‌‌ ఓపెన్ చేస్తారని తెలిపారు.  అనంతరం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.  అంతకుముందు ఐజీకి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. ఐజీ వెంట  ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎస్పీ రంగస్వామి  ఉన్నారు.

గోవర్దనగిరి రోడ్డు ఏడేండ్లైనా పూర్తి కాదా?: బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని  సుధాకర్ రావు 

వీపనగండ్ల, వెలుగు: గోవర్దనగిరి  నుంచి తూముకుంట వరకు చేపట్టిన డబుల్ లేన్‌‌ రోడ్డు నిర్మాణం ఏడేండ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని  బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని  సుధాకర్ రావు విమర్శించారు.  పాదయాత్రలో భాగంగా మంగళవారం వెల్లగొండ శివారు నుంచి గోవర్ధనగిరి,  గోపాల్ దిన్నె గ్రామాల వరకు నడిచారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేసిన గోవర్దనగిరి రోడ్డు పెండింగ్‌‌లో ఉండడంతో  గోవర్ధనగిరి, గోపాల్ దిన్నె  ప్రజలు, విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.  బీజేపీ  అధికారంలోకి వస్తే కొల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్‌‌,  వీపనగండ్ల, చిన్నంబాయి మండలాల అధ్యక్షులు రాకేశ్, జగ్గారి శ్రీధర్ రెడ్డి,  అసెంబ్లీ  కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్,  కో కన్వీనర్ అన్వేశ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి రోజా రమణి పాల్గొన్నారు.

3 నెలల్లో ట్యాంక్ బండ్‌‌ పనులు పూర్తి చేయాలి:    అడిషనల్ కలెక్టర్​ మయాంక్​ మిట్టల్​

మరికల్, వెలుగు: మినీట్యాంక్​ బండ్​ పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలని ‘పేట’  అడిషనల్​ కలెక్టర్​మయాంక్​ మిట్టల్​ అధికారులను ఆదేశించారు.  మంగళవారం స్థానిక పెద్దచెరువు వద్ద సాగుతున్న  ట్యాంక్​ బండ్​ పనులను  పరిశీలించారు.  జంగల్​కటింగ్​ చేసినా మళ్లీ ఎందుకు పెరిగిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంటనే దానిని తొలగించాలని ఆదేశించారు.  రూ.3.45 కోట్ల పనులకు గాను రూ.2 కోట్ల పనులు పూర్తయ్యాయని ఈఈ ప్రతాప్​సింగ్​వివరించారు.  రేలింగ్​పనులు పూర్తిదశలో ఉన్నాయని,  కట్టపై మెటల్​రోడ్డు, వాకింగ్​ ట్రాక్​ పనులు చేయాల్సి ఉందని చెప్పారు. అనంతరం బతుకమ్మ, వినాయక నిమజ్జన ఘాట్‌‌ను పరిశీలించిన  అడిషనల్ కలెక్టర్‌‌‌‌  ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించారు. డీఈ కిరణ్​కుమార్​, ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో బాలాజీ, సర్పంచి కె.గోవర్దన్​, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.