ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖలు  కొవిడ్ రూల్స్‌‌‌‌ పాటించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. సోమవారం కొవిడ్  రూల్స్‌‌‌‌, బూస్టర్ డోస్, కంటి వెలుగు ప్రోగ్రాంపై వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు కొవిడ్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. త్వరలోనే  తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, సంక్షేమ శాఖల ఆఫీసర్లతో రివ్యూ చేస్తానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న  ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సినేషన్‌‌‌‌పై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.  వీసీలో అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఎంహెచ్‌‌‌‌వో శశికాంత్, డీఐవో 
శంకర్  పాల్గొన్నారు.  

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నం:     నిరంజన్ రెడ్డి  

పెద్దమందడి, వెలుగు:  పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పథకాలను ఆపడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దమందడిలో జీపీ భవనం, ఆయుష్ దవాఖాన, జగత్ పల్లిలో వాల్మీకి భవనం,  చెక్ డ్యామ్ దగ్గర రోడ్డు, మనిగిల్ల, గట్ల ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లో  వైకుంఠ ధామాలను ప్రారంభించారు. అలాగే జగన్‌‌‌‌ పల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌‌‌‌,  మద్దిగట్లలో  హెల్త్ సబ్ సెంటర్, అమ్మపల్లి పరిధిలోని కావలి గుడిసెలు, చెరువుకొమ్ము తండాలో రోడ్లు గట్ల ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లో  వాల్మీకి భవనం, మంగంపల్లిలో విద్యుత్ సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌, ఎఫ్‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత పల్లెలు ఎలా మారారో ఒక్కసారి బేరీజు వేసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతితో రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజీ పడడం లేదని.. పార్టీలకతీతంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్, ఎంపీపీ మెఘారెడ్డి, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి,   రైతుబంధు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. 

చదువు, ఎవుసాన్ని నాశనం చేసిన్రు:రిటైర్డ్‌‌‌‌ ప్రొఫెసర్​ హరగోపాల్​

మరికల్​, వెలుగు :  విద్యా, వ్యవసాయ రంగాలను ప్రభుత్వాలు నాశనం చేశాయని రిటైర్డ్‌‌‌‌ ప్రొఫెసర్​హరగోపాల్ మండిపడ్డారు. సోమవారం మండల కేంaద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రైతు దినోత్సవానికి చీఫ్‌‌‌‌ గెస్టుగా హాజరై మాట్లాడారు. దేశంలో ఆహార కొరత లేదు గాని, ప్రజలు మాత్రం ఆకలి చావులతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.  ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి గిడ్డంగుల్లో ఉన్న ఆహర ధాన్యాలను పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడం లేదని మండిపడ్డారు. స్వామినాథన్​ కమిటీ సూచించిన విధంగా పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కనీస మద్ధతు ధర హామీని నిలబెట్టుకోలేకపోవడంతో  రైతులు మళ్లీ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. స్టూడెంట్లు చదువుతో పాటు రైతులు పడే ఇబ్బందులను తెలుసుకుని నోట్​బుక్‌‌‌‌లో రాసుకోవాలని సూచించారు.  అప్పుడే పరిష్కార మార్గాలు కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ స్కూళ్లు  రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని,  రైతు బిడ్డలు ఎవరైనా ఫీజులు కట్టకపోయినా ఇబ్బంది పెట్టొద్దని కోరారు.  అంతకుముందు రైతులను శాలువా, పూలమాలలతో సత్కరించారు.  ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  ఈ సమావేశంలో రిటైర్డ్‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ వనమాల, ఎంపీటీసీ గోపాల్​, శ్రీనివాస్​శర్మ, కరస్పాండెంట్​ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్​ వినీత,  ధర్మ జాగరణ ప్రాంత పరియోజన ప్రముఖ్​ ప్రభురాజ్​, లక్ష్మీకాంత్​రెడ్డి పాల్గొన్నారు.


 క్రికెట్ టోర్నీలో పాలిటిక్స్‌‌

అచ్చం పేట, వెలుగు: అచ్చంపేట పట్టణంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా లెవెల్ క్రికెట్ టోర్నీలో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళ్తే.. సెమీ ఫైనల్‌‌లో భాగంగా సోమవారం గ్రీన్ సిటీ ఎలెవన్,  మన్నెవారి పల్లి టీమ్‌‌లు తలపడ్డాయి.  గ్రీన్ సిటీ క్రికెట్ టీమ్‌‌కు అధికార పార్టీ నేతలు మద్దతివ్వగా. మన్నెవారి పల్లికి కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేశారు. అయితే మేనేజ్ మెంట్, అంపైర్లు  మన్నెవారి పల్లి బ్యాట్స్ మెన్‌‌లు అవుట్ కాకున్నా అవుట్‌‌గా ప్రకటిస్తున్నారని ఆరోపిస్తూ మద్దతుదారులు అంపైర్లతో గొడవకు దిగారు.  దీంతో గ్రీన్‌‌ సిటీ ఎలెవన్‌‌ మద్దతు దారులు కలగజేసుకొని అభ్యంతరం తెలిపారు.  పరిస్థితి ఇరువర్గాలు తోసుకునే వరకు వెళ్లడంతో  పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదర గొట్టారు. ఈ మ్యాచ్‌‌లో గ్రీన్ సిటీ టీమ్‌‌ విజయం సాధించి ఫైనల్‌‌కు చేరడం గమనార్హం. 


రైతులకు శాపంగా ధరణి పోర్టల్

గద్వాల, వెలుగు:   రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం డీకే అరుణ నివాసంలో  మీడియాతో మాట్లాడుతూ  ధరణి పోర్టల్‌‌‌‌ సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదన్నారు. రైతులు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధరణి రద్దు చేయడంతో పాటు  రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు.  రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, బండల వెంకట్ రాములు, డీటీడీసీ నరసింహులు, రజక జయశ్రీ  ఉన్నారు.

చిన్నారెడ్డికి టికెట్‌‌‌‌ ఇస్తే పని చేయలేం

 రేవంత్ రెడ్డిని  కలిసిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ నేతలు

వనపర్తి, వెలుగు:   మాజీ మంత్రి చిన్నారెడ్డి తమను కలుపుకుని పోవడం లేదని, ఆయనకు టికెట్‌‌‌‌ ఇస్తే తాము పనిచేయమని  సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకులు తేల్చిచెప్పారు. సోమవారం వనపర్తికి చెందిన  200 మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌‌‌‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.  డీసీసీ మాజీ అధ్యక్షుడు, పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్ కు  చిన్నారెడ్డి  షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని రేవంత్ దృష్టికి తెచ్చి.. వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. జిల్లాలో పార్టీ ఇప్పటికే చాలావరకు నష్ట పోయిందని,  ఇక నుంచైనా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు.  జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌కు గట్టి క్యాడర్‌‌‌‌‌‌‌‌ ఉందని సరిగ్గా వినియోగించుకుంటే  చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల్లో  పార్టీ గెలుస్తుందని వివరించారు.   చిన్నారెడ్డిని ఒప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. సర్వే చేయించి క్యాండిడేట్‌‌‌‌ను ఎంపిక చేయాలని, ఇందుకు అందరం కట్టబడి ఉంటామని స్పష్టం చేశారు.  స్పందించిన రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ‌‌‌‌కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్‌‌‌‌,  మాజీ పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, మాజీ జడ్పీటీసీలు రమేశ్ గౌడ్, వేణుగోపాల్, సీనియర్ నాయకులు తేనేటి రవీందర్ రెడ్డి,   మాజీ ఎంపీపీ శంకర్ నాయక్,  నేతలు ధనలక్ష్మి,  నరోత్తం రెడ్డి,  విష్ణువర్ధన్ రెడ్డి,   పాండు సాగర్,   రమేశ్,  రవి కిరణ్,  నందిమల్ల చంద్రమౌళి, శ్రీనివాసపూర్ రాములు, కురుమూర్తి,  దేవుజా నాయక్,   సర్వీశ్, గుమ్మడం రాజు,  శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

కంపెనీతో నష్టం జరిగితే పనులను అడ్డుకుంట:చిట్టెం రామ్మోహన్​రెడ్డి

మరికల్, వెలుగు:  ఇథనాల్​ కంపెనీ నుంచి వచ్చే పొల్యూషన్‌‌తో ప్రజలకు నష్టం జరితే తానే  పనులను అడ్డుకుంటానని మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి స్పష్టం చేశారు.  సోమవారం మండలంలోని జిన్నారంలోని 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తనూర్​ వద్ద ఏర్పాటవుతున్న ఇథనాల్​కంపెనీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని, పనులు పూర్తయితే  2 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కంపెనీ అవసరాలకు నీళ్లు తీసుకెళ్లుందుకు కాలువ పక్కన పైపులైన్​ పనులు చేస్తుండగా రైతులు, కొందరు ప్రతిపక్ష లీడర్లు అడ్డుకోవడం సరికాదన్నారు.  అధికారులు అనుమతి ఇస్తేనే వారు పనులు చేస్తున్నారని చెప్పారు.  పథకాల అమలులో కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  జిల్లా ఏర్పాటైన తర్వాత మరికల్​మండలంలో  ఇద్దరు తహసీల్దార్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారని, ఇకనైనా  సక్రమంగా పనిచేసి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీకళ, సర్పంచులు భాస్కర్​, రాములునాయక్, ఎంపీటీసీ రాజు, నాయకులు రాజవర్దన్​రెడ్డి, ప్రతాప్​రెడ్డి, సాయిరెడ్డి, చింతలయ్య పాల్గొన్నారు.

హక్కుల రక్షణకు పోరాటమే మార్గం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం, బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు పోరాటమే మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ తెలిపారు.  సోమవారం పార్టీ 98వ వార్షికోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో జెండా ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమయంలో సీపీఐ ఉరికొయ్యలు లెక్క చేయకుండా పోరాటం చేసిందని గుర్తు చేశారు. తర్వాత జమీందారులు, దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిందని వివరించారు. దున్నె వాడికే భూమి కావాలని కర్షకుల తరఫున,  హక్కులు సాధన కోసం కార్మికులు, ఉద్యోగుల తరఫున కదం తొక్కిన ఏకైక పార్టీ తమదేనన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడంతో పాటు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై భారం మోపుతోందని  విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు  ఆనంద్, నేతలు వెంకటయ్య,  శేషపాన్ని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్,  నేతలు గోపీచరి, శేఖరు, రామస్వామి పాల్గొన్నారు.