- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : పీఎండీడీకేవై పథకం అమలు కోసం ఆఫీసర్లు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో పీఎం ధాన్.. ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీఎండీడీకేవై అమలుకు ఎంపికైన 100 జిల్లాల్లో గద్వాల్కూడా ఉండడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పీఎండీడీకేవై వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదు చేసే సమాచారం ఫీల్డ్ లో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని తెలిపారు.
అనంతరం జిల్లాలో రెండేండ్లు పూర్తి చేసుకున్న కలెక్టర్ సంతోష్ ను జిల్లా ఆఫీసర్లు, తహసీల్దార్లు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్కేక్ కట్చేసి పంచిపెట్టారు. అంతకుముందు ట్రాన్స్ జెండర్లకు కలెక్టర్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియనాయక్ పాల్గొన్నారు.
