ధర్మపురిలో బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్ సత్యప్రసాద్ 

ధర్మపురిలో బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల టౌన్, వెలుగు: మార్చి 10 నుంచి 12రోజులపాటు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌‌లో ధర్మపురిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో  పటిష్ట బందోబస్తు చేపడతామన్నారు. భక్తులకు 12రోజుల పాటు ఉచిత అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో  శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు.