ఖిలా వరంగల్ (మామునూరు)/ వర్ధన్నపేట, వెలుగు : యువత క్రీడల్లో ప్రతిభ చాటేందుకు సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ లోని ఖుష్ మహల్ వద్ద సీఎం కప్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించగా, ర్యాలీ నూతనంగా నిర్మిస్తున్న ఐడీఓసీ కలెక్టరేట్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు నివాళులర్పించారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టెస్కాబ్ క్యాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి సీఎం కప్లో భాగంగా టార్చ్ ర్యాలీ నిర్వహించారు. యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు.
