మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: జిల్లాలో ఆయిల్  పామ్  సాగు కోసం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. హార్టికల్చర్, అగ్రికల్చర్​ ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయిల్  పామ్  సాగుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాల్లో ఆయిల్ ​పామ్​ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 54 ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు.

 ఆయిల్  పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. రైతులకు ఆయిల్​ పామ్​ సాగుతో వచ్చే లాభాల గురించి వివరించాలని సూచించారు. ఒక్కో మండలంలో 50 ఎకరాలకు తగ్గకుండగా సాగు చేయించాలని ఏవోలకు టార్గెట్  పెట్టారు. వారానికి మూడు రోజులు రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వంద శాతం టార్గెట్​ పూర్తి చేయాలని ఆదేశించారు. హార్టికల్చర్​ డీడీ రామలక్ష్మి, ఆయిల్  ఫెడ్ రాష్ట్ర ప్రత్యేకాధికారి సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన, పట్టు పురుగుల పెంపకం అధికారి సాయిబాబా,  డీఏవో జాన్ సుధాకర్, డీడీ రాజారత్నం పాల్గొన్నారు.