రూ.15లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే : కలెక్టర్ స్నేహ శబరీశ్

రూ.15లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే :  కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ కలెక్టరేట్/ హనుమకొండ సిటీ, వెలుగు: ఎన్ హెచ్ 163 వరంగల్ ములుగు మార్గంలోని కటాక్షపూర్ దగ్గర రూ.15లక్షలతో కాజ్ వే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్​తెలిపారు. కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణ పనులపై ఇరిగేషన్, నేషనల్ హైవే ఆఫీసర్లతో రివ్యూ చేశారు. కటాక్షపూర్ చెరువులోకి వచ్చే వరద గురించి ఆరా తీశారు. చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. 

కాజ్ వే నిర్మాణానికి కటాక్షపూర్ చెరువుపై నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎలా కట్టడి చేయవచ్చో సాగునీటి పారుదల శాఖ అధికారులు  సమగ్ర వివరాలు అందజేయాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీన్​ఫీల్డ్​ హైవే 163 జీ ప్రాజెక్టులో భాగంగా భూ సేకరణ పై కలెక్టర్​ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టులో భాగంగా భూ సేకరణ పూర్తయిన పరకాల డివిజన్ పరిధిలోని పరకాల, దామెర, శాయంపేట మండలాలకు చెందిన 10 గ్రామాల రైతులకు పరిహారం చెల్లించేందుకు జాతీయ రహదారుల శాఖ డిపాజిట్ చేయాలని ఆదేశించారు.