వెట్టి నిర్మూలన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 

వెట్టి నిర్మూలన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్​ ఆఫీస్​లో వెట్టి చాకిరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్​కు ఆయన హాజరై మాట్లాడారు. వెట్టి చాకిరి చట్టం ప్రకారం ఎక్కడైనా కేసులు నమోదైతే నిందితులను అక్కడికక్కడే రిమాండ్​ చేయించే అధికారం ఆర్డీవోకు ఉందన్నారు. జిల్లాలో వెట్టి కార్మికులు లేకుండా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 21 మంది వెట్టి చేసే కార్మికులను గుర్తించి విముక్తి చేశామని,  15 మందికి ఆర్థిక సాయం కింద చెక్కులు అందజేశామన్నారు.  

చాలా మందిని విముక్తి చేశాం

ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా  ఎస్​బీ పోలీసులతో స్పెషల్​ మీటింగ్స్, ఆపరేషన్ ముస్కాన్ చేపట్టి చాలా మందిని విముక్తి చేశామన్నారు.  ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి షేర్వాన్ , అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు , ఏఎస్పీ  రాములు,  ఆర్డీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​‘డబుల్’ ఇండ్ల పై హౌసింగ్​శాఖ ఆఫీసర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

జనవరి 31 నాటికి జిల్లాలో అన్ని డబుల్ ​బెడ్​రూం ఇండ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  కాగా ఆర్ఈసీ ద్వారా చేపట్టిన స్కూల్​ప్రహరీ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని  కలెక్టర్ ఇంజినీరింగ్​ఆఫీసర్లను ఆదేశించారు. రూరల్ ఎలక్ర్టిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సీఎస్​ఆర్​కింద చేపట్టిన స్కూల్ ప్రహరీలు, గేట్ల పనులపై సమీక్షించారు.  పోలీస్​ రిక్రూట్​మెంట్​పరీక్షలకు అన్ని శాఖల ఆఫీసర్లు సహకరించాలని  ఆదేశించారు. తన చాంబర్​లో ఎస్పీ తో కలిసి రిక్రూట్​మెంట్​ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.  60 మంది పీఈటీలను కేటాయించాలని డీఈవోను ఆదేశించారు. 

బ్యూటిఫికేషన్​ పనులు పూర్తి చేయాలి

సీఎం కేసీఆర్​ డిసెంబర్ 4న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభించనుండడంతో  బ్యూటిఫికేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన  ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్​లో బ్యూటిఫికేషన్​పనులను తనిఖీ చేశారు. ఆఫీస్​ఎదుట పైలాన్, హెలీపాడ్, చుట్టుపక్కలా పరిశీలించారు.  

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి కలెక్టర్ షేక్ యాస్మిన్​ బాషా

వనపర్తి/నాగర్ కర్నూల్/ మహబూబ్​నగర్​ కలెక్టరేట్,  వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి  ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని శుక్రవారం వనపర్తి, నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్ కలెక్టర్లు కోరారు. ​ ఈ సందర్భంగా నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్​కలెక్టర్లు ఉదయ్​కుమార్​, వెంకట్​రావు ​ప్రకటనలు విడుదల చేయగా, వనపర్తి  ఆర్డీవో ఆఫీస్ లో స్పెషల్​ఓటరు 
నమోదు పై కలెక్టర్​అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26, 27న డిసెంబర్ 3, 4 తేదీల్లో స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమం క్యాంపెయిన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్యాంపెయిన్​లో అర్హులైన అందరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. వంద  శాతం ఓటరు నమోదు పూర్తిచేయాలని ఆమె సూచించారు.